Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఉద్యమంపై పరిశోధనకు తాళ్ల అజయ్‌కు డాక్టరేట్

0 3

తెలంగాణ ఉద్యమంపై పరిశోధనకు తాళ్ల అజయ్‌కు డాక్టరేట్

– ఓయూ 85వ స్నాతకోత్సవంలో పట్టా ప్రదానం.

బెస్ట్ వాయిస్, ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థుల పాత్రపై పరిశోధన చేసిన చెన్నారావుపేట (రాజీవ్‌నగర్ కాలనీ)కు చెందిన తాళ్ల అజయ్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో ఆయనకు పట్టా ప్రదానం చేశారు. ‘రోల్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ మూవ్‌మెంట్ (1956–2014)’ అంశంపై అజయ్ చేసిన పరిశోధనకు ఈ డాక్టరేట్ లభించింది. తెలంగాణ గవర్నర్, ఓయూ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అజయ్ డాక్టరేట్ పట్టా స్వీకరించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, గురువులు, బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన విద్యార్థులు, ఉద్యమకారులకు తన డాక్టరేట్‌ను అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.